దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హాకీ ప్రపంచకప్ పోటీలో ఆడే భారత జట్టును ఆదివారం ప్రకటించారు. భారత హాకీ జట్టుకోచ్ జోస్.. ప్రమోద్ సింగ్‌ను కెప్టెన్‌గా నియమించాలని సెలక్షన్ కమిటీని కోరారు. అంతేగాకుండా హాకీ జట్టుకు నాలుగు వైస్ కెప్టెన్‌లను కూడా ఎంపికచేయాలని కోరారు.
కానీ కోచ్ డిమాండ్‌ను లెక్క చేయని సెలక్షన్ కమిటీ రాజ్‌పాల్ సింగ్‌నే తిరిగి భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. దీంతో సంక్షోభంతో కూరుకుపోయిన హాకీ జట్టులో తిరిగి విబేధాలు తలెత్తాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఈ నెల 28వ తేదీ నుంచి న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోన్న 12వ హాకీ ప్రపంచకప్ పోటీలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన పలు జట్లు పాల్గొంటున్న ఈ పోటీలకు పూర్తి భద్రతను కల్పించారు.