వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఇంటర్‌షూట్ టోర్నీ: మూడో స్వర్ణం చేజార్చుకున్న బింద్రా! (Olympic Champion | Abhinav Bindra | Gold Award | Air Rifle)
Bookmark and Share Feedback Print
 
FILE
నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఇంటర్‌షూట్ టోర్నీలో ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా మూడో స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. ఇంటర్‌షూట్‌ టోర్నీలో అభినవ్‌ బింద్రా తృటిలో మూడో స్వర్ణాన్ని చేజార్చుకోగా, మహిళల విభాగంలో సుమా షురూర్‌ రెండో స్వర్ణాన్ని దక్కించుకొంది. అంతకుముందు జరిగిన రెండు పోటీల్లో బింద్రా రెండు పసిడి పతకాలు సాధించాడు. కానీ మూడో మ్యాచ్‌లో మాత్రం బింద్రా రజతంతో సరిపెట్టుకున్నాడు.

పురుషులు, మహిళల విభాగంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం పోటీల్లో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత బింద్రా 697.7 పాయింట్లతో రజతం సాధించాడు. దీంతో జర్మనీ షూటర్‌ టినో మోహాట్‌ 697.8 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అంతకుముందు రెండు పోటీల్లో టినో రజత పతకాలను కైవసం చేసుకున్నాడు.

మహిళల విభాగంలో సుమా షిరూర్‌ రెండో స్వర్ణం గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల టోర్నీలో సుమా రెండో, మూడో పోటీల్లో పసిడి పతకం సాధించడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.