దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోన్న హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 28 నుంచి మార్చి 13వరకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మెగా టోర్నీకి భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
భద్రతలో భాగంగా.. స్టేడియం ప్రాంగణం చుట్టూ దాదాపు 100 వరకు క్లోజ్‌డ్ సర్క్యూట్ టెలివిజన్‌లు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. టోర్నీలో పాల్గొనే జట్లకు పూర్తి భద్రత ఏర్పాటు చేస్తామని, దీనిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.
భారత్‌లో ఈ ఏడాది జరుగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు రిహార్సల్స్‌గా ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా 14 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లు ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి.