వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » టైగర్, ఎలిన్‌లు ఒక్కటయ్యారోచ్.. అయితే పెళ్లి ఉంగరం ఏది..?! (Tiger Woods | Elin Nordegren | American Golf Star | Sexual Relations | Marriage Ring)
Bookmark and Share Feedback Print
 
Tiger Woods
FILE
వివాహేతర సంబంధాలతో, విచ్చలవిడి శృంగార కార్యకలాపాలతో తన ప్రతిష్టను మసకబార్చుకున్న అమెరికన్ గోల్ఫ్ స్టార్ టైగర్ ఉడ్స్‌కు మళ్లీ మంచిరోజులు రానున్నాయి. టైగర్ చేష్టలతో విసుగుచెందిన అతని భార్య ఎలిన్ నార్డెగ్రెన్ మళ్లీ ఉడ్స్ చెంతకు చేరింది. అయితే వారి పెళ్లినాటి ఉంగరాన్ని మాత్రం ఎలిన్ చేతికి ధరించలేదు.

కారు ప్రమాదం అనంతరం ఒక్కొక్కటిగా వెలుగుచూసిన టైగర్ రాసలీలలతో మానసికంగా చాలా గాయపడ్డ ఎలిన్, అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పలు కథనాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తన భాగోతాలన్నింటినీ టైగర్ ఒప్పుకోవటమేగాక, వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు గోల్ఫ్‌కు కూడా స్వస్తి చెప్పనున్నట్లు ప్రకటించిన సంగతి పాఠకులకు తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆరువారాలపాటు ఉడ్స్ ఓ పునరావాస కేంద్రంలో కూడా గడిపాడు. కాపురాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో బిజిగా ఉన్న టైగర్‌పై కొద్ది రోజుల క్రితం వరకు కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. టైగర్ ఏ మాత్రం మారలేదనీ, మళ్లీ మాజీ ప్రియురాళ్లతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని పలు ఊహాగానాలు వెల్లడయ్యాయి. అయితే అవన్నీ నిజం కాదనీ, టైగర్ భార్యతో కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడనీ, దీంతో ఎలిన్ కూడా అతడికి పచ్చజెండా ఊపిందని ఓ పత్రిక తెలిపింది. సో.. ఇప్పటికయినా టైగర్ పూర్తిగా మారిపోయి, భార్యా పిల్లలతో ఆనందంగా జీవిస్తాడని ఆశిద్దాం.!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.