ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రభ్‌జోత్‌ను కెప్టెన్‌గా చేసేందుకు బ్రాసా తీవ్ర యత్నాలు..? (Prabhjot singh | Sports | Jose Brasa | Rajpal Singh | FIH World Cup | Hockey Captain)
ప్రభ్‌జోత్‌ను కెప్టెన్‌గా చేసేందుకు బ్రాసా తీవ్ర యత్నాలు..?
FILE
గత కొన్ని రోజులుగా భారత పురుష, మహిళా హాకీ జట్లలో నెలకొన్న వివాదాల నుంచి గట్టెక్కిన హాకీ ఇండియా (హెచ్ఐ) ఎట్టకేలకు ప్రపంచకప్ పోటీలకు సన్నద్ధమవుతోంది. అయితే తాజాగా మరో కొత్త వివాదానికి తెరలేచిందనీ.. భారత జట్టు కెప్టెన్ ఎంపికపై చీఫ్ కోచ్ జోస్ బ్రాసా ఇప్పటికీ అసంతృప్తితో రగిలిపోతున్నాడనీ, మళ్లీ ప్రభ్‌జోత్ సింగ్‌ను కెప్టెన్‌గా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాడని అనధికార వర్గాల సమాచారం.
ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ ఎంపిక ప్రక్రియ పూర్తయినా, బ్రాసా మాత్రం ఇప్పటికీ ప్రభ్‌జోత్‌ను ఆ పదవికి ఎంపిక చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రభ్‌జోత్ స్వంత ఊరుకి స్వయంగా వెళ్లిన బ్రాసా, కెప్టెన్‌గా ఎంపికయ్యేలా చూస్తానని ఇదివరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని అభయం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
అలాగే.. ఒకవేళ ప్రభ్‌జోత్ కెప్టెన్సీ రానిపక్షంలో ఈ వ్యవహారాన్ని ప్రపంచకప్ బహిష్కరించేంతదాకా తీసుకెళతానని బ్రాసా శపథం చేసినట్లు హాకీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా ప్రస్తుతం కెప్టెన్‌గా ఎంపిక చేసిన రాజ్‌పాల్ సింగ్ పట్ల జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే భారత హాకీలో మరో వివాదానికి తెరలేచినట్లు అనిపిస్తోంది.