ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » స్వీడన్ ఓపెన్ స్క్వాష్: సౌరవ్ పరాజయం (Sweden Open Squash Tournament | Saurav Ghosal | Defeat | England | Matthews)
భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ స్వీడన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంటులో తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. ఇంగ్లండ్‌కు చెందిన నిక్ మాథ్యూస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌరవ్ 7-11, 4-11, 11-5, 5-11 స్కోరు తేడాతో ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఇదిలా ఉంటే.. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సౌరవ్ ఒక్క స్థానం దిగజారి 30వ ర్యాంకుతో సరిపెట్టుకుననాడు. గత సంవత్సరం 14 టోర్నమెంట్‌లు ఆడిన సౌరవ్, 1860 పాయింట్లను దక్కించుకున్నాడు. కాగా.. సౌరవ్ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 29వ ర్యాంక్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇక వెటరన్ రిత్విక్ భట్టాచార్య 113 నుంచి 116వ స్థానంలోకి పడిపోయాడు. మిగిలిన భారతీయ క్రీడాకారుల్లో సిద్ధార్థ సుచేద్, హరిందల్ పాల్ సంధూలు వరుసగా 97, 108 స్థానాల్లో నిలిచారు. అలాగే జోత్స్న చినప్ప 35వ స్థానం దక్కించుకోగా, దీపికా పల్లికాల్ 46వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. వరల్డ్ యంగెస్ట్ ఎవర్ ప్లేయర్ డబ్ల్యూఐఎస్‌పీఏ టైటిల్‌ను అందుకున్న మహిళా స్క్వాష్ క్రీడాకారిణి అనక అలంకమోని 9 స్థానాలను మెరుగుపరచుకుని తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 78వ ర్యాంకుకు చేరుకుంది.