ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సెరెనాకు పిల్లలకంటే కుక్కపిల్లలే ఎక్కువట..!! (Serena Williams | Children's | Dogs | Actor | Rapper Common | American | Asians)
ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ ఏస్ క్రీడాకారిణి సెరేనా విలియమ్స్‌కు చిన్నపిల్లలకంటే కుక్కపిల్లలంటేనే ఎంతో ముద్దట. పిల్లల్ని కనటం ఇష్టమే అయినప్పటికీ, అంతకంటే తన వద్దనున్న రెండు కుక్కపిల్లలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానంటోంది.
సెరెనా చాలా కాలం నుంచి ప్రముఖ నటుడు రాఫ్పెర్ కామన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అతగాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఈ అమ్మడు కలలు కంటోంది. ఇది తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆమె చుట్టూ గుమిగూడారు. పెళ్లి సరే.. ఆ తర్వాత పిల్లల్ని కంటారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో, తనకు పిల్లలంటే చాలా ఇష్టమనీ, అంతకంటే ముందు తనవద్దనున్న రెండు కుక్కపిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టమని సెరెనా పేర్కొంది.
అదే విధంగా పిల్లల్ని కనటం అనే అంశం అమెరికన్లకు చాలా తేలికైన విషయమనీ, అయితే ఆసియా వాసులకు ప్రత్యేకించి భారతీయులకు అదో చిన్న జోల్ట్ లాంటిదేనని సెరెనా వ్యాఖ్యానించింది. అంతేగాకుండా తనకు కుక్కపిల్లలంటే ఎంతో ప్రేమో చెప్పేందుకు ఉదాహరణగా ఓ కథను కూడా వినిపించేసింది.
అదేంటంటే... ఓసారి తాను లాకర్ రూంలో చాలా బిజీగా ఉండిపోవటంతో, పని ముగించుకుని ఇంటికి కార్లో వెళ్తున్న సమయంలోగానీ కుక్కపిల్లల సంగతి గుర్తురాలేదట. అప్పుడు వాటి విషయం గుర్తుకు రాగానే చాలా బాధపడిపోయిందట. అందుకే పిల్లలు వద్దనిపిస్తుందనీ, ఎందుకంటే పిల్లలు ఉంటే వాటిని ఎక్కడ అశ్రద్ధ చేస్తాననే బెంగ కూడా ఉంటుందని సెరెనా చెప్పుకొచ్చింది.
సో.. టెన్నిస్ ప్రపంచపు రారాణి అయిన సెరెనాకు ముద్దులొలికే చిన్నారులకంటే, కుక్కపిల్లలే ఎక్కువ ఇష్టమని అర్థమవుతోంది కదూ..! అమెరికన్ కల్చర్‌కు, భారతీయ సంస్కృతికి తేడా ఇదే మరి..!!