వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » పట్టాయా ఓపెన్‌లో సానియాకు ఆరో సీడింగ్ (Sania Mirza | Pattaya Open | Sixth Seeding | Thailand | Germany | Tatjana Malek)
Bookmark and Share Feedback Print
 
Sania
FILE
థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరుగుతున్న పట్టాయా ఓపెన్‌లో భారత స్టార్, హైదరాబాదీ అమ్మడు సానియా మీర్జాకు ఆరో సీడింగ్‌ను కేటాయించారు. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నమెంటులో సానియా తన తొలి రౌండ్ మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది.

కాగా.. ఈ టోర్నీ మొదటి రౌండ్‌లో జర్మనీకి చెందిన తాత్యానా మాలెక్‌తో సానియా మీర్జా తలపడుతుంది. స్థాయికి తగినట్లుగా ఆడితే ఈసారి సానియా కనీసం సెమీ ఫైనల్ వరకయినా చేరుకునే అవకాశం లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా సోమవారం ప్రకటించిన ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా సింగిల్స్‌లోనూ, డబుల్స్‌లోను తన స్థానాలను పదిలం చేసుకుంది. తాజాగా ఫెడ్ కప్‌లో విజయాల బాటలో సాగిపోతున్న సానియా, సింగిల్స్‌‌లో 59, డబుల్స్‌లో 33వ ర్యాంకింగ్స్‌లోనూ కొనసాగుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.