వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రభ్‌జోత్ కెప్టన్‌గా కావాలి: బ్రాసాతో ఆటగాళ్ల కుమ్మక్కు..? (Hockey World Cup | Hockey India | Prabhjot Singh | Captain | Chief Coach | Brasa | Rajpal Singh)
Bookmark and Share Feedback Print
 
Hockey
FILE
హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే టీం ఇండియాకు ప్రభ్‌జోత్ సింగ్ కెప్టెన్‌గా కావాలని పట్టుబడుతున్న కోచ్ బ్రాసాకు మద్ధతుగా ఆటగాళ్లు కూడా జతకట్టినట్లు తెలుస్తోంది. బకాయిల చెల్లింపులు, జీతాల పెంపు తదితర అంశాలలో హాకీ ఇండియాతో వివాదం సమయంలో ప్రస్తుత కెప్టెన్ రాజ్‌పాల్ సింగ్‌కు కొంతమంది ఆటగాళ్లు మద్ధతు ఇవ్వని సంగతి తెలిసిందే. దానికి తోడుగా ప్రపంచకప్‌కు రాజ్‌పాల్‌కే కెప్టెన్సీ ఇవ్వాలని హెచ్ఐ నిర్ణయం ఆటగాళ్లలో ఒక వర్గానికి నచ్చటంలేదనీ, వాళ్లు ప్రభ్‌జోత్ కెప్టెన్‌గా రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆటగాళ్లు కోచ్ బ్రాసాకు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే... ప్రభ్‌జోత్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని పట్టుబట్టిన బ్రాసా.. ఆడ్రియన్ డిసౌజా, దీపక్ ఠాకూర్, అర్జున్ హలప్పా, రాజ్‌పాల్ సింగ్‌లను వైస్ కెప్టెన్లుగా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే సెలక్టర్లు మాత్రం బ్రాసా సూచనను ఖాతరు చేయకుండా రాజ్‌పాల్‌కు పగ్గాలు అప్పగించారు. దీంతో బ్రాసా ప్రభ్‌జోత్‌నే కెప్టెన్‌గా చేయాలంటూ వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ సీనియర్ ఆటగాడు మాట్లాడుతూ.. ప్రపంచ కప్‌కు ముందు ఈ వివాదం జరగటం అందరినీ నిరాశ పరుస్తోందనీ, కెప్టెన్సీపై ఎందుకింత గందరగోళం సృష్టిస్తున్నారని జట్టు సమావేశంలో అడగాలని అనుకుంటున్నామని పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాలతో సతమతం అవుతున్న హాకీ ఇండియాకు ప్రభ్‌జోత్ కెప్టెన్సీ మరో పెద్ద సమస్యగా తయారయ్యే అవకాశం ఉన్నట్లు క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.