ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » శాఫ్ క్రీడలు : వాలీబాల్ ఫైనల్లో పాక్‌పై భారత్ విజయం (Saf Sports | India | Gold Medals | Silver | Sports)
శాఫ్ క్రీడలు : వాలీబాల్ ఫైనల్లో పాక్‌పై భారత్ విజయం
FILE
ఢాకాలో జరుగుతున్న పదకొండవ దక్షిణాసియా (శాఫ్) క్రీడల్లో భారత హాకీ ఆటగాళ్లు చేయలేని సాహసాన్ని వాలీబాల్ ఆటగాళ్లు చేసి చూపించారు. ఈ క్రీడల్లో పదకొండవ రోజైన సోమవారంనాడు జరిగిన వాలీబాల్ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
తొలి గేమ్‌లో 23-25 స్కోరుతో ఓడిన భారత ఆటగాళ్లు అత్యుత్తమమైన పోరాట పటిమను ప్రదర్శించి చివరి రెండు గేమ్‌లను 25-23, 25-14 స్కోరు తేడాతో గెలుచుకుని పసిడిని తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా.. సోమవారం రోజు భారత్ మొత్తంమీదా 21 స్వర్ణ, 13 రజత, 7 కాంస్య పతకాలను సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మొత్తం 88 స్వర్ణ, 53 రజత, 29 కాంస్య పతకాలతో పతకాల పట్టీలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఇదే టోర్నీలో భారత స్విమ్మర్లు నాలుగు స్వర్ణాలతో తమ పోరును ముగించారు. కొత్త మీట్ రికార్డును కూడా నెలకొల్పిన స్విమ్మర్ వీరులు మొత్తం పతకాల సంఖ్యను 25 పెంచుకున్నారు. వీటిలో 16 రజతాలున్నాయి. ఇక బాక్సింగ్‌లో పాల్గొన్న ముగ్గురు భారత బాక్సర్లు కూడా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలను గెలుపొందటం విశేషం.