ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఇటలీ ఏటీపీ ఛాలెంజర్: ప్రకాశ్ అమృతరాజ్ నిష్క్రమణ (Italy ATP Challenger Event | Prakash Amritraj | Harsh Mankad | Singles | Doubles)
ఇటలీలోని బెర్గామోలో జరుగుతున్న ఏటీపీ ఛాలెంజర్ ఈవెంట్ సింగిల్స్‌లో ప్రకాశ్ అమృతరాజ్ నిష్క్రమించాడు. 4,25,00 యూరోల ఫ్రైజ్‌మనీ కలిగిన ఈ టోర్నో తొలి రౌండ్లోనే అన్‌సీడెడ్ ప్రకాశ్ అపజయం పాలవటంతో, సింగిల్స్‌లో భారత్ పోరు సమాప్తమయ్యింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలో దిగిన మర్కో క్రగ్‌నోలాతో ఓపెనింగ్ రౌండ్లో తలపడిన ప్రకాశ్ 5-7, 6-1, 5-7 స్కోరు తేడాతో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ర్యాంకింగ్ పాయింట్లేవీ సంపాదించని ఇతను, 440 యూరోలను మాత్రం సంపాదించుకున్నాడు. అయితే సింగిల్స్‌లో పోరు ముగిసినా, డబుల్స్‌లో ప్రకాశ్, హర్ష్ మన్కడ్‌లు వారి వారి జోడీలతో తమ సత్తా చాటుకోవాలని ఉబలాటపడుతున్నారు.
ఇందులో భాగంగా.. అమెరికా క్రీడాకారుడు బ్రెందవన్ ఇవాన్స్‌తో జోడీ కట్టనున్న ప్రకాశ్, కజకిస్తాన్‌కు చెందిన మిఖాయిల్ కుకుష్కిన్ మరియు ఇటలీకి చెందిన అలెస్సాండ్రోతో తలపడనున్నాడు. అలాగే మన్కడ్ జమైకా ఆటగాడు డస్టిన్ బ్రౌన్‌తో జోడీ కట్టి వీరిద్దరూ జొనాథన్ మ్యారీ, జామీ ముర్రేలతో ఓపెనింగ్ క్యాంపెయిన్‌లో తలపడనున్నాడు.