ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సౌత్ ఏసియన్ గేమ్స్: 90 స్వర్ణాలతో జయహో భారత్..!! (South Asian Games | Bangladesh | Dhaka | SAG | Gold Medal | Clean Sweep | Table Tennis)
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరుగుతున్న పదకొండవ సౌత్ ఏసియన్ గేమ్స్ (శాగ్)లో భారత్ అత్యధికంగా 90 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. చివరి రోజైన మంగళవారంనాటికి 90 స్వర్ణ, 55 వెండి, 30 కాంస్య పతకాలతో మొత్తం 175 పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
టేబుల్ టెన్నిస్ ఆటగాడు మధురిక పట్కర్ మూడు వ్యక్తిగత స్వర్ణపతకాలతోపాటు ఒక టీమ్ స్వర్ణపతకాన్ని గెలుచుకుని ఏసియన్ గేమ్స్‌కు ముగింపు పలికాడు. అలాగే మిగతా టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లంతా కూడా పతకాలను సాధించి దక్షిణాసియా క్రీడలకు బై బై చెప్పారు. మొత్తంమీదా టేబుల్ టెన్నిస్‌లో 7 స్వర్ణాలతోపాటు 5 రజత పతకాలను సాధించారు. పురుషుల మారథాన్ 42.1 కిలోమీటర్ల విభాగంలో చివరి రోజున భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ మెగా ఈవెంట్‌లో మొదటి స్థానంలో భారత్ నిలవగా, రెండో స్థానం కోసం పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎట్టకేలకు పాకిస్తాన్ 19 స్వర్ణ, 25 రజత, 36 కాంస్య పతకాలతో రెండో స్థానంలో నిలవగా.. 18 స్వర్ణ, 23 రజత, 56 కాంస్య పతకాలతో మూడోస్థానానికి పరిమితమైంది.