వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కెప్టెన్‌ను మార్చేది లేదు.. ప్రపంచకప్‌పై దృష్టిపెట్టండి! (Hockey World cup | Captain | Rajpal singh | Prabhjot)
Bookmark and Share Feedback Print
 
FILE
భారత హాకీ జట్టుకు ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన రాజ్‌పాల్ సింగ్‌‌ను మార్చే ప్రసక్తే లేదని హాకీ ఇండియా (హెచ్ఐ) స్పష్టం చేసింది. కాబట్టి కెప్టెన్‌ను మార్చే విషయాన్ని అటుంచి, కోచ్ ఆటగాళ్లు ప్రపంచకప్‌పై దృష్టి సారించాలని హెచ్ఐ సూచించింది.

జట్టు కెప్టెన్సీ నుంచి రాజ్‌పాల్‌ను తొలగించి ప్రభ్‌జ్యోత్ సింగ్‌ను నియమిస్తారనే ఊహాగానాలపై హెచ్ఐ ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా స్పందిస్తూ.. కెప్టెన్‌ను మార్చే ఆలోచన లేదన్నారు. ఇంకా ప్రభ్‌జ్యోత్‌ను సమర్థిస్తూ టీం ఇండియా మేనేజ్‌మెంట్ నుంచి లేఖ అందిందని వస్తున్న వార్తలను కూడా బాత్రా తోసిపుచ్చారు.

ఇంకా బాత్రా మాట్లాడుతూ.. కెప్టెన్‌ను మార్చాల్సిందిగా జట్టు నుంచి తమకు ఎలాంటి ఉత్తరం అందలేదన్నారు. సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని బాత్రా తేల్చి చెప్పారు. ఈ నెల 28 నుంచి మార్చి 13వరకు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే.

ఈ పోటీల్లో పాల్గొనే భారత హాకీ జట్టును గత ఆదివారం సెలక్టర్లు ప్రకటించారు. ఈ మెగా టోర్నీ కోసం జట్టుకు రాజ్‌పాల్ నాయకత్వం వహిస్తాడని సెలక్టర్లు ప్రకటించారు. కానీ దీనిపై చీఫ్ కోచ్ బాస్రా విభేదిస్తూ.. ప్రభ్‌జ్యోచ్‌కు ఆ పదవిని అప్పగించాలని డిమాండ్ చేసిన సంగతి విదితమే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.