వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » భారత్-పాక్ మ్యాచ్‌కు జెడ్ త్రిబుల్ ఫ్లస్ సెక్యూరిటీ..!! (Pakistan | India | Hockey world cup | Securitymen | FIH | Leandro Negre)
Bookmark and Share Feedback Print
 
Hockey
FILE
న్యూఢిల్లీలోని మేజర్ దయాన్ చంద్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హాకీ ప్రపంచకప్‌కు భారత ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 8.35 గంటలకు ప్రారంభం కానున్న భారత్-పాకిస్థాన్ తొలి మ్యాచ్ సందర్భంగా రక్షణ కోసం జెడ్ త్రిబుల్ ఫ్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

కాగా.. గత 28 సంవత్సరాలుగా ప్రపంచకప్ ఆతిథ్యానికి నోచుకోని భారత్.. ప్రస్తుతం ఆతిథ్యం ఇవ్వనున్న 2010 హాకీ ప్రపంచకప్‌‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. టోర్నీకి, ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలన్నింటినీ ప్రభుత్వం పకడ్బందీగా చేసింది.

16 వేల సీట్ల సామర్థ్యం కలిగిన మేజర్ దయాన్ చంద్ స్టేడియంలో జరుగనున్న భారత్-పాక్‌ల తొలిమ్యాచ్‌కు టిక్కెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే స్టేడియం నిర్ణీత సామర్థ్యంకంటే ఎక్కువమంది ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే అవకాశం ఉండటంతో స్టేడియం చుట్టూ 5 వేల మంది పోలీసులు, వంద మంది కమెండోలు, మరో వెయ్యిమంది పారా మిలటరీ బలగాలను రక్షణ కోసం నియమించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.