ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా జోన్ ఉబెర్‌కప్: భారత్‌కు నాలుగో స్థానం (Asia Zone Uber Cup | Saina Nehwal | Japan | India | Aparna Balan)
ఆసియా జోన్ ఉబెర్‌కప్ టోర్నమెంట్ భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూడటంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం మూడో స్థానం జపాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 2-3 తేడాతో పరాజయం చవిచూసింది.
భారత నెంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి సింగిల్స్‌లో 21-17, 21-16 తేడాతో గోటోపై విజయం సాధించి 1-0 ఆధిక్యాన్ని అందించింది. తొలి డబుల్స్‌లో గుత్తా జ్వాలా-అశ్విని జోడీపై 16-21, 15-21 తేడాతో పుజీ-రికా జోడీ గెలవడంతో 1-1తో సమం అయింది.
మరోవైపు రెండో సింగిల్స్‌లో హిరోషి ఇరికో 22-20, 21-13 తేడాతో సయాలీ ఘోషల్‌పై విజయం సాధించింది. దీంతో 2-1 పాయింట్ల తేడాతో జపాన్ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక కీలకమైన మూడో సింగిల్స్‌లో తృప్తి 21-8, 21-16తో హిరాయామపై సునాయసంగా విజయం సాధించి స్కోరును 2-2తో సమం చేసింది.
కానీ చివరి డబుల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్-అపర్ణ బాలన్‌పై 16-21, 10-21 తేడాతో మియుకీ-సటాకోలు గెలిచి జపాన్‌కు 3-2 ఆధిక్యంతో పాటు మూడోస్థానాన్ని దక్కించారు. సైనా నెహ్వాల్ జంటపై జపాన్ ద్వయం మ్యాచ్ మొదటి నుంచే ఆధిక్యాన్ని సంపాదించుకుంది. దీంతో భారత్‌ను ఒక స్థానం వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది.