వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » దుబాయ్ ఓపెన్: నోవాక్ జకోవిక్‌కు సింగిల్స్ టైటిల్..! (Dubai Open Tennis Tournament | Serbia | Mikhail Youzhny | Novak Djokovic | ATP Dubai Open)
Bookmark and Share Feedback Print
 
Djecovik
FILE
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిక్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. రష్యాకు చెందిన మిఖాయిల్ యూజ్నీతో ఫైనల్స్‌లో తలపడిన జకోవిక్ 7-5, 5-7, 6-3 స్కోరు తేడాతో విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా జకోవిక్ ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

కాగా.. ఈ ఫైనల్ మ్యాచ్ శనివారం రోజునే నిర్వహించగా, భారీ వర్షం కారణంగా అది నిలిచిపోయింది. ఆ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిక్ 7-5, 2-0 స్కోరు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తరువాత ఆదివారం మళ్లీ మ్యాచ్‌ను జరుపగా అందులో జకోవిక్ గెలుపొందాడు.

విజయానంతరం జకోవిక్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో తొలి ఏటీపీ టైటిల్‌ను సాధించటంతో చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ముఖ్యంగా గట్టి ప్రత్యర్థితో తలపడిన ఈ మ్యాచ్ తనకు ఎల్లప్పుడూ గుర్తుంటుందని పేర్కొన్నాడు. ఈ టైటిల్ విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచిందనీ, ముందు ముందు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటాననీ ధీమా వ్యక్తం చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.