వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ హాకీ కప్: సత్తా చాటిన దక్షిణ కొరియా! (World Hockey Cup | South Korea | Germany | Hockey | Sports)
Bookmark and Share Feedback Print
 
ప్రపంచకప్‌ హాకీ తొలి మ్యాచ్‌లోనే దక్షిణ కొరియా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీపై గట్టి పోటీని ప్రదర్శించి పూల్‌-ఏ మూడో మ్యాచ్‌‌ను 2-2తో డ్రాగా ముగిసింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి దక్షిణ కొరియా అద్భుతమైన ఆటతీరుతో జర్మనీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. ఆట 3వ నిముషంలోనే సంగ్‌ హ్యూన్‌ గోల్‌ చేసి కొరియాకు ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. పెనాల్టీ కార్నర్‌ నిపుణుడు హ్యూన్‌ జర్మనీ గోల్‌ కీపర్‌ను ఖంగుతినిపిస్తూ జట్టుకు తొలి గోల్‌ సాధించి పెట్టాడు. 15వ నిముషంలో ఫార్వర్డ్‌ నామ్‌ యంగ్‌ లీ రెండో గోల్‌ చేశాడు.

ప్రథమార్ధంలో ప్రపంచ నెంబర్‌వన్‌ జర్మనీపై కొరియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జర్మనీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో జర్మనీపై సంచలన విజయాన్ని నమోదు చేసిన కొరియా న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోన్న ప్రపంచకప్ హాకీ తొలి మ్యాచ్‌లో రాణించింది.

కానీ మ్యాచ్‌కు ద్వితీయార్థంలో జర్మనీ పుంజుకొంది. అటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ పటిష్టమైన రక్షణశ్రేణి కలిగిన దక్షిణ కొరియా జపాన్ దాడులను నైపుణ్యంగా ఎదుర్కొంది. అయితే జర్మనీ స్టార్‌ ఫ్లోరియన్‌ పుచ్‌ 50వ నిముషంలో జర్మనీకి తొలి గోల్‌ అందించాడు.

మరో 8 నిముషాల తర్వాత స్ట్రైకర్‌ బెంజిమన్‌ వెస్‌ మరో గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. చివర్లో జర్మనీ పైచేయి సాధించినా మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కొరియా సఫలమైంది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీని మట్టికరిపించే అవకాశాన్ని దక్షిణ కొరియా సద్వినియోగం చేసుకోలేకపోయిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.