వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » శివేంద్రపై నిషేధాన్ని 2 మ్యాచ్‌లకు కుదించిన ఎఫ్ఐహెచ్ (Sports | Hockey World Cup | India | Pakistan | Striker Shivendra Singh | Tournament Director | Ken Read)
Bookmark and Share Feedback Print
 
Hockey World Cup
FILE
భారత స్ట్రైకర్ శివేంద్ర సింగ్‌పై విధించిన 3 మ్యాచ్‌ల నిషేధాన్ని 2 మ్యాచ్‌లకు కుదించినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మంగళవారం ప్రకటించింది. కాగా.. శివేంద్ర వ్యవహారంపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యులుగల ఎంక్వైరీ పానెల్, శివేంద్రపై విధించిన నిషేధాన్ని 2 మ్యాచ్‌లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థానీ ఆటగాడు ఫరీద్‌‌ను దురుసుగా అడ్డుకున్నందుకు ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్ కీన్ రీడ్ సోమవారం శివేంద్రపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎఫ్ఐహెచ్ తాజా నిర్ణయంతో టీం ఇండియా ఇకపై స్పెయిన్, ఆస్ట్రేలియాలతో తలపడే మ్యాచ్‌లలో శివేంద్ర ఆడేందుకు వీలుపడదు.

ఇదిలా ఉంటే... పాకిస్థాన్ ఆటగాడిని శివేంద్ర అసలు కొట్టలేదనీ, పాక్ ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్ కీన్ రీడ్ తమ ఆటగాడిపై నిషేధం విధించటం సబబుకాదని టీం ఇండియా మేనేజిమెంట్, నిషేధానికి వ్యతిరేకంగా ఈరోజు అప్పీల్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీం ఇండియా కెప్టెన్ రాజ్‌పాల్ సింగ్, మరి జట్టు సభ్యులందరూ శివేంద్ర ఎలాంటి తప్పూ చేయలేదనీ, అతడిని అన్యాయంగా శిక్షిస్తున్నారంటూ వాపోయారు. శివేంద్రపై నిషేధం తొలగిపోగలదని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోచ్ జోస్ బ్రాసా మాట్లాడుతూ.. శివేంద్రపై కీన్ రీడ్ తీసుకున్న నిర్ణయం చాలా ఇబ్బందికరమైనదనీ, తమ ఆటగాడు ఎలాంటి తప్పూ చేయలేదని, నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.