వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బిల్లే జీన్ కింగ్ కప్: వీనస్ విలియమ్స్ విజయం..! (Venus Williams | Serena Williams | Kim Clijsters | Billie Jean King Cup)
Bookmark and Share Feedback Print
 
Venus Williams
FILE
న్యూయార్క్‌లో జరుగుతున్న బిల్లే జీన్ కింగ్ కప్ టెన్నిస్ టోర్నీలో అమెరికన్ స్టార్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కిమ్ క్లియస్టర్స్‌పై విజయం సాధించింది. కాలి గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్న సోదరి సెరెనా బాధ్యతను నెత్తికెత్తుకున్న వీనస్ 6-4, 3-6, 7-5 స్కోరు తేడాతో గెలుపొందింది. దీంతో యూఎస్ ఓపెన్‌లో తన సోదరిపై ఆధిపత్యం ప్రదర్శించిన క్లియస్టర్స్‌ను మట్టిగరిపించిన వీనస్, సెరెనాకు కాస్త ఊరట కలిగించింది.

కాగా.. వారం రోజుల క్రితం సెరెనా విలియమ్స్ కాలి గాయం కారణంతో బిల్లే జీన్ కింగ్ కప్ టెన్నిస్ టోర్నీనుంచి తప్పుకుంది. యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్స్‌లో పరాజయం పాలైనప్పటినుంచి కిమ్‌తో తలపడే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సెరెనాకు ఆ అవకాశం కాస్తా దక్కకుండా పోయింది. అయితే సెరెనా అవకాశాన్ని వీనస్ చేజిక్కించుకుని కిమ్‌ను ఓడించింది.

ఈ గేమ్‌లో 26 సంవత్సరాల బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్ వీనస్‌తో ఆడేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. అయినప్పటికీ విజయం మాత్రం వీనస్‌నే వరించింది. మ్యాచ్ అనంతరం కిమ్ మాట్లాడుతూ.. వీనస్‌తో ఆడిన ఈ మ్యాచ్ కాస్త కష్టంగానే సాగినా, గత మ్యాచ్‌లకంటే ఇందులో మంచి ఆటతీరునే ప్రదర్శించానని పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.