వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హాకీ ప్రపంచకప్: భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆసీస్! (Hockey World cup | India | Australia | Pakistan | England)
Bookmark and Share Feedback Print
 
FILE
హాకీ ప్రపంచకప్ రెండో కీలక లీగ్ మ్యాచ్‌‌లో భారత్‌కు చుక్కెదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలిచిన ఉత్సాహంతో బరిలోలికి దిగిన భారత్‌ను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. మంగళవారం రాత్రి ధ్యాన్‌చంద్‌ హాకీ నేషనల్‌ స్టేడియంలో జరిగిన పూల్‌-బి ఆరో మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ప్రపంచ నెంబర్‌ టూ ఆస్ట్రేలియా 5-2 తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది.

తొలి అర్ధ భాగంలో 3-1 ఆధిక్యంలో నిలిచిన ఆసీస్‌, రెండో అర్ధ భాగంలోనూ అదే జోరును కొనసాగించి టోర్నీలో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌ జట్టులో యంగ్‌ (2 నిమిషం), టర్నల్‌ (8ని, 43 ని), డెస్మండ్‌ (26ని), డోనర్‌ (42ని)లు గోల్స్‌ చేయగా, భారత జట్టులో విక్రమ్‌ పిళ్లై (35 నిమిషం), కెప్టెన్‌ రాజ్‌పాల్‌సింగ్‌ (50ని.) గోల్స్‌ చేశారు. ఆసీస్‌ విజయంలో కీలకపాత్ర వహించిన మిడ్‌ఫీల్డర్‌ రాబర్డ్‌ హమండ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

మ్యాచ్ ప్రారంభం నుంచే గట్టిపోటీని ప్రదర్శించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, భారత స్ట్రైకర్లను ఆటాడుకున్నారు. ఇంగ్లండ్‌పై ఓటమితో దెబ్బతిన్న పులిలా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలో విజృంభించారు. లాంగ్‌ పాస్‌లతో దూకుడునే ఆయుధంగా చేసుకొని భారత్‌ ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయారు. ఫలితంగా ఆస్ట్రేలియా భారత్‌ను చిత్తుగా ఓడించి, హాకీ ప్రపంచ కప్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.