వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » శివేంద్ర లోటుతోనే ఆసీస్‌ చేతిలో ఓడాము: కోచ్ బ్రాసా (Shivendra Singh | Australia | Hockey World Cup | India coach Jose Brasa)
Bookmark and Share Feedback Print
 
Brasa
FILE
పాకిస్థాన్ స్ట్రైకర్‌ను కొట్టాడన్న ఆరోపణలతో రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొంటున్న భారత హాకీ వీరుడు శివేంద్ర సింగ్ లోటుతోనే మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూసిందని ఆ జట్టు కోచ్ జోస్ బ్రాసా అభిప్రాయపడ్డారు.

తమ జట్టు స్ట్రైకర్లు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బాగానే ఆడారని, కానీ ఆస్ట్రేలియా ఫాస్ట్ విధానంలో బాగా ఆడిందని బ్రాసా అన్నారు. కానీ ఫాస్ట్-పేస్డ్ హాకీ విధానాన్ని తాము ఉపయోగించలేదని బ్రాసా వివరణ ఇచ్చారు. మొత్తానికి భారత్ కంటే ఆస్ట్రేలియా గట్టిపోటీతో అద్భుతంగా ఆడిందని బ్రాసా చెప్పారు.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్‌లో కసితో ఆడిందని, దీనికి తోడు ఆసీస్ ఆటగాళ్లు అదృష్టవశాత్తు గోల్స్‌ను సాధించారని బ్రాసా అన్నారు. దీనికి తొలి నిమిషంలోనే ఆసీస్ సాధించిన మొదటి గోల్‌లే నిదర్శనమని కోచ్ ఎత్తి చూపారు.

కానీ పెనాల్టీ కార్నర్స్‌తో భారత జట్టుకు అదృష్టం కలిసి రాలేదని బాస్రా చెప్పుకొచ్చారు. ఇంకా శివేంద్ర సింగ్ జట్టుకు దూరం కావడం తో భారత హాకీ జట్టుకు తీరని లోటు కలిగిందని ఆయన అన్నారు. శివేంద్ర సింగ్ లోటును జట్టు సభ్యులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని కోచ్ వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.