భారత్‌తో జరుగనున్న డేవిస్ కప్ మెగా ఈవెంట్‌కు రష్యా ఆటగాడు నికోలాయ్ డెవిడెంకో దూరమయ్యాడు. ఈ వారంతంలో (మార్చి ఐదో తేదీ నుంచి ఏడోతేదీ వరకు) జరిగే ఈ టోర్నీకి మణికట్టు గాయం కారణంగా డెవిడెంకో తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్ మ్యాచ్‌లో డెవిడెంకో పాల్గొనడం లేదు.
ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక దుబాయ్ ఓపెన్‌లోనూ గాయం కారణంగా మధ్యలోనే నిష్క్రమించిన డెవిడెంకోకు, ఫిబ్రవరిలో జరిగిన రోటెర్‌డామ్ సెమీస్ సందర్భంగా గాయం ఏర్పడింది.
ఇకపోతే.. డేవిస్ కప్ టోర్నమెంట్లో డెవిడెంకో పాల్గొనకపోవడంతో అతని స్థానంలో 38వ ఏటీపీ ర్యాంకర్ ఇగోర్ ఆండ్రీవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు రష్యా టెన్నిస్ సమాఖ్య చీఫ్ షామిల్ తర్పిచేవ్ తెలిపారు. ఇతనితో పాటు మైకేవ్ యూజ్నీ, తిమురాజ్ గాబ్రషివిల్లి, ఇగోర్ కునిత్సెన్‌లను కూడా రష్యా జట్టులో చేర్చారు.