ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్‌లో పతకాలు సాధించడమే లక్ష్యం: సానియా (Sania Mirza | Commonwealth Games | Medals | Pakistan | Indian Hockey team | Sachin Tendulkar)
దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌పై భారతీయ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా దృష్టి పెట్టింది. మణికట్టు గాయం కారణంగా ఇటీవల జరిగిన టెన్నిస్ టోర్నమెంట్లలో గట్టిపోటీని ప్రదర్శించలేకపోయిన సానియా మీర్జా, కామన్వెల్త్‌లో రాణించాలని భావిస్తోంది. ఇంకా కామన్వెల్త్ పోటీల్లో భారత్‌కు పతకాలు సాధించిపెట్టడమే తన లక్ష్యమని సానియా చెప్పింది.
కొల్‌కతాలోని పైలాన్ వరల్డ్ స్కూల్ రెసిడెన్షియల్ టెన్నిస్ అకాడమీలో మీడియాతో మాట్లాడిన సానియా మీర్జా.. కామన్వెల్త్‌లో పతకాలు సాధించే దిశగా ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. మణికట్టు గాయం నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నానని హైదరాబాదీ అమ్మాయి వెల్లడించింది. ఇంకా ఆరు వారాల్లో గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్నానని సానియా చెప్పింది.
ఇకపోతే.. హాకీ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై నెగ్గిన భారత హాకీ జట్టును సానియా మీర్జా అభినందించింది. అలాగే గ్వాలియర్ వన్డేలో డబుల్ సెంచరీ సాధించి, అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్‌కు దేశ అత్యున్నత పురస్కారం "భారత రత్న"ను అందజేయాలని సానియా ప్రభుత్వాన్ని కోరింది.