ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఏ అథ్లెట్ అయినా ఓడిపోవాలని ఆడడు: వీజేందర్ (New Delhi | Hero Honda Hockey World Cup | India | Olympics Bronze Medalist | Boxer Vijender Singh)
న్యూఢిల్లీ జరుగుతున్న హీరో హోండా హాకీ ప్రపంచ కప్‌లో భారత్ ప్రదర్శనకు అభిమానులు, నిపుణులు అసంతృప్తితో ఉంటే.. ఒలింపిక్ బాక్సింగ్ కాంస్య పతక విజేత వీజేందర్ సింగ్ మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. ఏ అథ్లెట్ అయినా ఓడిపోవాలని గేమ్ ఆడడనీ, జట్టుకు ఇది కష్టకాలమని వ్యాఖ్యానించాడు. ఇలాంటి సమయంలోనే జట్టుకు నైతిక స్థైర్యాన్ని అందిస్తూ, భవిష్యత్తులో మంచిగా రాణించేందుకు సహాయపడాలని అందరూ సహాయపడాలని వీజేందర్ సూచించాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ బాక్సింగ్‌లో కూడా రజత పతక విజేత అయిన వీజేందర్ మాట్లాడుతూ.. భారత జట్టు ఆడుతున్న మ్యాచ్‌లను స్వయంగా స్టేడియంలో ఉండి చూసేందుకు వీలుపడకపోయినా, టీవీలలో అన్ని మ్యాచ్‌లనూ చూశానన్నాడు. కాగా.. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లో ఒక దాంట్లో విజయం సాధించగా, మరో గేమ్‌ను డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అలాగే మిగతా మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ ట్రైనింగ్ షెడ్యూల్‌లో భాగంగా తరలివెళ్లిన వీజేందర్, తనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే భారత హాకీ జట్టు మ్యాచ్‌లను టీవీల్లో చూసేందుకు ఆసక్తి చూపించాడు. ఈ ప్రపంచ నెంబర్‌వన్ మిడిల్ వెయిట్ బాక్సర్, ఆటలో గెలుపు ఓటములు సహజమేననీ.. టీం ఇండియా కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి చేయూతనివ్వటం తన కర్తవ్యంగా భావించి, ఇలా ముందుకు రావటం హర్షణీయం.