వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ స్టేడియాల నిర్మాణం: షీలా దీక్షిత్ డెడ్‌లైన్! (Sheila Dikshit | Deadline | Commonwealth games | CWG venues | Jawaharlal nehru stadium)
Bookmark and Share Feedback Print
 
FILE
దేశ రాజధాని నగరం ఆతిథ్య మిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌ కోసం స్టేడియాలు సెప్టెంబర్ 10-15లోపు సిద్ధమవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి డెడ్‌లైన్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.

ముందుగా ఆగస్టు 31కల్లా స్టేడియాల నిర్మాణాలను పూర్తి చేయాలని భావించాం. కానీ భారీ వర్షాలతో నిర్మాణ పనులకు అంతరాయం కలిగింది. అయితే ప్రస్తుతం ఈ పనులు వేగిరంగా జరుగుతున్నాయి.

ఈ నిర్మాణ పనులు సెప్టెంబర్ 10-15 తేదీల్లోపు స్టేడియాలు సిద్ధమవుతాయని షీలా దీక్షిత్ చెప్పారు. కామన్వెల్త్ మెగా ఈవెంట్‌కు న్యూఢిల్లీ అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని షీలా దీక్షిత్ అన్నారు.

అయితే షీలా దీక్షిత్ విధించిన డెడ్‌లైన్‌లోపే కామన్వెల్త్ గేమ్స్ నిర్మాణ పనులు పూర్తవడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యే లోపు స్టేడియాలు సిద్ధంగా ఉంటాయన్న విషయాన్ని దీక్షిత్ చెప్పకనే చెబుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.