వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ క్రీడల హాకీ జట్టు ఎంపికలో గందరగోళం! (Commonwealth games | Hocky india | Sports | New Delhi | India)
Bookmark and Share Feedback Print
 
వచ్చే అక్టోబరు మూడో తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల కోసం భారత హాకీ జట్టు ఎంపికలో అనిశ్చితి నెలకొంది. ఈ క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించే 16 మంది ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై తీవ్రస్థాయిలో గందరగోళం చెలరేగింది. ఈ వార్తలపై హాకీ ఇండియా ఖండించింది.

పుణెలోని బెలవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన రెండు రోజుల ట్రయల్స్ శనివారం ముగిసిన తర్వాత సెలెక్షన్ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిందని, ఈ 16 మందే వచ్చే నవంబర్‌లో చైనాలోని గ్వాంగ్‌జులో జరిగే ఆసియా గేమ్స్‌లోకూడా పాల్గొంటారని అజ్ఞాత వ్యక్తి పంపిన ఇ-మెయిల్ పేర్కొంది.

దీనిపై హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరేంద్ర బాత్రా మండిపడ్డారు. తాము ఎలాంటి జట్టు ఎంపిక చేయలేదన్నారు. ఈ క్రీడల్లో పాతినిథ్యం వహించే జట్టును సోమవారం ప్రకటిస్తామని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమైనవిగా ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.