ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బీజింగ్ ఒలింపిక్స్‌కు ధీటుగా కామన్వెల్త్: కల్మాడీ (Beijing olympics | New Delhi | commonwealth | Suresh Kalmadi | Rehman)
న్యూఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలను బీజింగ్ ఒలింపిక్ పోటీలకు ధీటుగా నిర్వహిస్తామని కామన్వెల్త్ క్రీడల నిర్వహణా కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ చెప్పారు. కామన్‌వెల్త్ క్రీడల థీమ్ సాంగ్‌ను శనివారం రాత్రి ఆవిష్కరించారు. అక్టోబరు మూడు నుంచి 14వ తేదీ వరకు జరిగే క్రీడలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ప్రధానంగా, చైనా రాజధాని బీజింగ్‌లో గత యేడాది జరిగిన ఒలింపిక్ పోటీల కంటే ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీల నిర్వహణ దేశానికే అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల పోటీలను విజయవంతం చేస్తామన్నారు.