ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » 30 నుంచి ఆల్ ఇండియా స్కూల్ స్క్వాష్ పోటీలు (All India School Squash | Kolkata | East Zone | Boys and girls | Sports)
ఈనెల 30వ తేదీన ఈస్ట్ జోన్ పరిధిలో ది పంజ్ లాయడ్ ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ స్క్వాష్ ఛాంపియన్ పోటీలు ప్రారంభంకానున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు జరిగే ఈ పోటీలు కల్‌కతా రాకెట్ క్లబ్‌లో జరుగుతాయి. బాల, బాలికల విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ పోటీలు వ్యక్తిగత విభాగాలతో పాటు గ్రూపుల వారీగా నిర్వహించనున్నారు. ఇందులో 11, 13, 15, 17 వయస్సున్న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారని స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈస్ట్ జోన్ అధికారులు వెల్లడించారు.
ఈ పోటీల్లో విజేతలైన వారిని వచ్చే డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగే ఇంటరో జోనల్ ఫైనల్ పోటీల్లో ఆడేందుకు అనుమతి ఇస్తారు. డిసెంబరు 2010లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భాగంగా ఈ క్వాలిఫైయింగ్ పోటీలను నిర్వహించారు.