వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఎ.ఆర్. రెహ్మాన్ థీమ్ సాంగ్ అంత బాగోలేదు: మల్హోత్రా (A.R. Rehman | Theme Song | Malhotra | Oscar Award Winner | Commonwealth Games)
Bookmark and Share Feedback Print
 
ఆస్కార్ అవార్డు గ్రహీత, స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహ్మాన్ రూపొందించిన థీమ్ సాంగ్ ఆశించిన స్థాయిలో లేదని కామన్వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ కార్యనిర్వాహక బోర్డు సభ్యుడు వి.కె. మల్హోత్రా పెదవి విరిచారు. ఈ సాంగ్‌ అంత బాగోలేదని, దీనిని మరలా రూపొందించాలని మల్హోత్రా సూచించారు.

"మా తుఝే సలాం" వంటి కొన్ని అద్భుత గీతాలను స్వరపరిచిన ఎ.ఆర్. రెహ్మాన్, ప్రస్తుతం కామన్వెల్త్ కోసం రూపొందించిన థీమ్‌సాంగ్‌ అంత ప్రభావవంతంగా లేదన్నారు. అయినా కామన్వెల్త్ క్రీడలకు ఇంకా కొంత సమయం ఉన్నందున ఈ థీమ్ సాంగ్‌ను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దవచ్చునని భావిస్తున్నట్లు మల్హోత్రా అన్నారు.

కాగా., అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ థీమ్ సాంగ్‌ను రెహ్మాన్ శనివారం నాడు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, కామన్‌వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ తదితరుల సమక్షంలో రెహ్మాన్ ఈ థీమ్ సాంగ్‌ను పాడి వినిపించారు.

ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ, ఈ పాటను స్వరపరిచే అవకాశం ఇవ్వడం నిజంగా తనను గౌరవంగా ఉందన్నారు. అయితే మళ్లీ ఈ పాటను రూపొందించాలన్న మల్హోత్రా వ్యాఖ్యలపై రెహ్మాన్ ఏవిధంగా స్పందిస్తారో? వేచి చూడాల్సిందే..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.