వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్: పంకజ్, సేథీల తొలి విజయం! (Billiards Championship | Pankaj Advani | Geet Sethi | Sports)
Bookmark and Share Feedback Print
 
జాతీయ పురుషుల బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ, గీత్ సేథీలు తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ, ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్ గీత్ సేథీలు తమ తమ ప్రత్యర్థులపై గట్టిపోటీని ప్రదర్శించి గెలుపును నమోదు చేసుకున్నారు.

సోమవారం ఆరంభమైన ఈ టోర్నీ 100-అప్ ఫార్మాట్‌లో అద్వానీ 3-0తో అమిత్‌లాత్‌పై విజయం సాధించాడు. దాదాపు గంటసేపు జరిగిన ఈ గేమ్‌లో అద్వానీ వరుస ఫ్రేముల్లో అమిత్‌ను ఓడించాడు.

మరో గేమ్‌లో సేథీ 3-0తో రాజ్‌కుమార్‌ని మట్టికరిపించాడు. ఇతర గేమ్‌ల్లో భారత్ నెంబర్ టూ సౌరవ్ కొఠారి 3-0తో పామిన్ షాపై, దేవేంద్ర జోహీ 3-0తో సుమేశ్ టర్కీపై విజయం సాధించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.