ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » యూఎస్ ఓపెన్: సోమదేవ్ దేవ్‌వర్మన్‌కు చుక్కెదురు! (Somdev Devvarman | US Open | Men's singles | Kevin Anderson | South Africa | India)
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత యువ టెన్నిస్ స్టార్ సోమదేవ్ దేవ్‌వర్మన్‌కు చుక్కెదురైంది. ఆరంభ రౌండ్లోనే ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైన సోమదేవ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో సోమదేవ్ దేవ్‌వర్మన్, దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ ఆండర్సన్‌తో బరిలోకి దిగాడు.
అయితే ఆండర్సన్‌ను భారీ షాట్లతో కట్టడి చేయలేకపోయిన సోమదేవ్ 3-6 4-6 3-6 తేడాతో ఓటమిని చవిచూశాడు. ఫలితంగా డైరక్ట్ ఎంట్రీతో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలోకి ప్రవేశించిన సోమదేవ్ వర్మన్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.
దీంతో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో భారత పోరు ముగిసినట్లైంది. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లకు అర్హత సాధించలేకపోయిన సోమదేవ్ వర్మన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలోనూ తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టాడు.