అమెరికాలో సోమవారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. టాప్ సీడ్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ సమంత స్టోసూర్ ఈ టోర్నీ ఆరంభ రౌండ్లో విజయం సాధించి, రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.
తొలి రౌండ్లో రష్యాకు చెందిన ఎలీనా వెస్నీనాతో బరిలోకి దిగిన సమంతా 3-6, 7-6, 6-1 తేడాతో గెలుపొందింది. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అయిన సమంత స్టోసూర్ ఒక గంట 52 నిమిషాల పాటు జరిగిన తొలి రౌండ్ పోరులో మెరుగైన షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసింది.
రష్యాకు చెందిన 64వ ర్యాంకర్ వెసీనా సమంత స్టోసూర్ షాట్లను ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమైంది. ఫలితంగా ఈ టోర్నీ నుంచి వెస్నీనా నిష్క్రమించింది.