వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ ట్రయల్స్‌కు నేను హాజరుకావడం లేదు: రాథోడ్ (Commonwealth Trails | Rajyavardhan Singh Rathore | Sports)
Bookmark and Share Feedback Print
 
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌కి తాను హాజరుకావడంలేదని ఒలింపిక్ రజత పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్‌లో వెల్లడించాడు. అయితే భారత జట్టుకు రాథోడ్ శుభాకాంక్షలు తెలిపాడు. ట్రయల్స్‌కి తాను హాజరుకాకపోయిన, భారత జట్టు మాత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నానని రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా ఒలింపిక్ రజత పతక విజేత రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం లేదు. షూటింగ్ జట్టుకోసం జరిగిన ట్రయల్స్‌కి గైర్హాజరవడంతో రాథోడ్ ఈ క్రీడల్లో పోటీపడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

ఇకపోతే.. జాతీయ జట్టు ఎంపిక బుధవారం జరుగనుంది. అయితే రాథోడ్ ట్రయల్స్‌కి ఎందుకు హాజరు కాలేదో తమకు తెలియదని జాతీయ రైఫిల్ సంఘం(ఎన్ఆర్ఎఐ) కార్యదర్శి రాజీవ్ భాటియా తెలిపారు.

మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఫిబ్రవరి నుంచి రాథోడ్ రికార్డు ఏ మంత బాగోలేదని, ఈ ఈవెంట్‌లో పోటీపడడం రాథోడ్ కెరీర్‌కి ఉపయోగపడేదని జాతీయ జట్టు కోచ్ సన్నీ థామస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.