వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జర్మిలా గ్రోత్‌పై తొలి రౌండ్లో నెగ్గిన మరియా షరపోవా! (Maria Sharapova | US Open | Jarmila Groth | Russia | Grand Slam champion)
Bookmark and Share Feedback Print
 
FILE
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లో రష్యన్ 14వ సీడ్ మరియా షరపోవా విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన జర్మీలా గ్రోత్‌తో బరిలోకి దిగిన మరియా షరపోవా 4-6, 6-3, 6-1 పాయింట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన 23 ఏళ్ల రష్యన్ బ్యూటీ షరపోవా, తదుపరి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ ఇవెటా బెనోసోవాతో తలపడనుంది.

అలాగే 2, 3 రౌండ్లలో షరపోవా గెలిచినట్లైతే నాలుగో రౌండ్లో యూఎస్ ఓపెన్ టాప్ సీడ్ కరోలిన్ వోజ్నియాకీ (డెన్మార్క్)తో బరిలోకి దిగే అవకాశముంది. మాజీ ప్రపంచ నెంబర్ వన్ షరపోవా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 24 ఆరంభ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా.. స్లోవేకియాలో పుట్టిన గ్రోత్ గత ఏడాది ఏటీపీ ప్లేయర్ శ్యామ్ గ్రోత్‌ను పెళ్లాడి, ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.