వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » యూఎస్ ఓపెన్: తొలి రౌండ్లో రఫెల్ నాదల్ గెలుపు! (Rafael Nadal | US Open | Teymuraz Gabashvili | Australia | French | Wimbledon | US Open titles)
Bookmark and Share Feedback Print
 
FILE
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ తొలి రౌండ్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. రష్యాకు చెందిన తెమురాజ్ గబాష్విలితో బరిలోకి దిగిన టాప్‌సీడ్ రఫెల్ నాదల్, 7-6 (7/4), 7-6 (7/4), 6-3 తేడాతో విజయం సాధించాడు. మూడు గంటల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో రఫెల్ నాదల్ ఆద్యంతం ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించాడు.

ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వక అద్భుతంగా ఆడిన రఫెల్ నాదల్, ఆరంభ రౌండ్ విజేతగా నిలిచాడు. ఫలితంగా తదుపరి రౌండ్లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్భెకిస్థాన్)తో బరిలోకి దిగనున్నాడు.

ఈ సందర్భంగా రఫెల్ నాదల్ మాట్లాడుతూ.. ఇదే ఊపుతో తదుపరి మ్యాచ్‌ల్లో గట్టిపోటీని ప్రదర్శిస్తానని చెప్పాడు. భారీ షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యానని నాదల్ వెల్లడించాడు. తిరిగి గాడిలో పడేందుకు తీవ్రంగా కృషి చేస్తానని, తప్పకుండా విజయపరంపర కొనసాగిస్తానని స్పెయిన్ బుల్ అన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.