వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ గేమ్స్: భారత బాక్సింగ్ జట్టు ప్రకటన! (Commonwealth Games | Asian Games | Amandeep Singh | Paramjit Samota | Manpreet Singh)
Bookmark and Share Feedback Print
 
దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడా పోటీల్లో ఆడే భారత బాక్సింగ్ జట్టును ప్రకటించారు. కామన్వెల్త్ క్రీడా పోటీల్లో పతకాలు సాధించే దిశగా పటిష్టమైన జట్టును ఎంపిక చేసినట్లు ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ వెల్లడించింది.

ఈ జట్టులో అమన్‌దీప్ సింగ్ (49కేజీలు), సురంజయ్ సింగ్ (52కేజీలు), అఖిల్ కుమార్ (56కేజీలు), జై భగవాన్ (60కేజీలు), మనోజ్ కుమార్ (64కేజీలు), దిల్బాగ్ సింగ్ (69కేజీలు), విరేందర్ సింగ్ (75కేజీలు), దినేష్ కుమార్ (81), మన్‌ప్రీత్ సింగ్ (91కేజీలు)లు ఉన్నారు.

పాటియాలాలో ఆగస్టు 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఆసియా గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా కామన్వెల్త్ పోటీలకు ముందుగా భారత బాక్సర్లు ప్రాక్టీస్ లభించినట్లైందని ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.