ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » లియాండర్ పేస్ జోడీ అవుట్: రోహన్ బోపన్న జోడీ ఇన్! (Rohan Bopanna | Aisam-ul Haq Qureshi | US Open | Leander Paes | Lukas Dlouhy | Martin Damm)
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో భారత రోహన్ బోపన్న జోడీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్లు, మూడో సీడ్ భారత లియాండర్ పేస్-లుకాస్ డౌహ్లీ ద్వయం తొలి రౌండ్లోని పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.
ఇందులో రోహన్ బోపన్న-ఖురేషి జంట తొలి రౌండ్ విజయం ద్వారా రెండో రౌండ్లోకి ప్రవేశించగా, లియాండర్ పేస్ ద్వయం తొలి రౌండ్లోనే పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.
పేస్-డౌహ్లీ ద్వయం తొలి రౌండ్లో చెక్ రిపబ్లిక్-స్లోవేకియా కాంబినేషన్ మార్టిన్ డామ్ మరియు ఫిలిప్ పొలాసెక్ జంటతో చేతిలో 6-7 (7), 6-3, 6-4 తేడాతో చిత్తుగా ఓడింది. 2006, 2009వ సంవత్సరాల్లో రెండుసార్లు విజేతగా, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన పేస్ ద్వయానికి మార్టిన్ డామ్ జోడీ షాక్ ఇచ్చింది.
ఇకపోతే.. రోహన్ బోపన్న- ఖురేషి జోడీ తమ ప్రత్యర్థి జంటపై గట్టిపోటీని ప్రదర్శించారు. అమెరికాకు చెందిన బ్రియాన్ బటిస్టోన్-రైలర్ డిహార్ట్ జోడీని 6-7 (7), 6-3, 6-4 తేడాతో బోపన్న జోడీ మట్టికరిపించింది. ఫలితంగా డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న ద్వయం స్థానిక సికూ బంగౌర-నాథన్ పాషా లేదా మైకేల్ కోహ్లమన్ (జర్మన్)-జార్ఖో నిమినేన్ (ఫిన్‌లాండ్) జంటతో తలపడే అవకాశం ఉంది.