ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ క్రీడాపోటీల నుంచి వైదొలగిన స్టార్ అథ్లెట్లు! (Commonwealth Games | Athlets | Sports | David Rudisha)
కామన్వెల్త్ క్రీడాపోటీల నుంచి వైదొలగిన స్టార్ అథ్లెట్లు!
దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడా పోటీలకు అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమవుతున్న నేపథ్యంలో తాజాగా 800 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు సాధించిన డేవిడ్ రుదీష కూడా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇతనితో పాటు రెండు సార్లు యూరోపియన్ లాంగ్ డిస్టెన్స్ ఛాంపియన్‌గా నిలిచిన మహమ్మద్ ఫరా కూడా కామన్వెల్త్ పోటీల్లో ఆడేది లేదని తెలిసింది.
వరుస టోర్నమెంట్లలో పాల్గొనడంతో బాగా అలసిపోవడంతోనే కామన్వెల్త్ క్రీడా పోటీల్లో ఆడట్లేదని ఈ ఇద్దరు అథ్లెట్లు తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2012 ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమవుతున్నట్లు కెన్యాకు చెందిన రుదీష అన్నాడు.