ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » యూఎస్ ఓపెన్: ప్రీ-క్వార్టర్స్‌లోకి క్లియస్టర్స్, సమంత! (US Open | Pre-quaters | Kim Clisters | Samanta | Sports | Tennis)
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి రెండో సీడ్ కిమ్ క్లియస్టర్స్, ఐదోసీడ్ సమంతా స్టోసూర్, 12వ సీడ్ ఎలెనా దెమెంతివాలు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడోరౌండ్లో బెల్జియం అమ్మ క్లియ్‌స్టర్స్ 6-3, 6-0తో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై వరుస సెట్లలో విజయం సాధించింది.
ఇత ఇతర మ్యాచ్‌ల్లో స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-2, 6-3 తో సారా ఎరాని (ఇటలీ)పై, దెమెంతివా(రష్యా) 7-5, 6-2తో హంతుచోవా (స్లొవేకియా)ను మట్టికరిపించి, ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఆద్యంతం ప్రత్యర్థులపై క్లియస్టర్స్, స్టోసూర్, దెమెంతివాలు గట్టిపోటీని ప్రదర్శించారు. భారీ షాట్లతో తమ తమ ప్రత్యర్థులను కట్టడి చేశారు. ఫలితంగా ప్రీ-క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు.
అలాగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రష్యా భామలు మరియా షరపోవా, వెరా జొనరేవా, స్వెత్లానా కుజ్‌నెత్సోవా, సెర్బియా స్టార్ జెలెనా జంకోవిచ్‌లు విజయం సాధించారు.