ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డబుల్స్‌లోనూ సానియా మీర్జా జోడీకి చుక్కెదురు! (Sania Mirza | US Open | Singles Doubles | Rohan Bopanna | Sports | Tennis)
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలోనూ భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే ప్రత్యర్థి జంటపై ధీటుగా రాణించడంలో విఫలమైన సానియా మీర్జా జోడీ, ఇంటిదారి పట్టింది.
ఈ మ్యాచ్‌లో సానియా మీర్జా-వెరా దుషెవినా (రష్యా) ద్వయం 7-6(6), 2-6, 6-7(3)తో అలీసా క్లెబనోవా/ఎకటిరా నీ మకరోవా జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటికే మహిళల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో ఓటమి చవిచూసిన సానియా మీర్జా డబుల్స్‌లోనూ రాణించలేకపోవడంతో యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.
ఇకపోతే.. పురుషుల డబుల్స్‌లో భారత యువ సంచలనం రోహన్ బోపన్న జోడీ ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించింది. రెండోరౌండ్లో బోపన్న-ఖురేషి (పాకిస్తాన్) జంట 6-4, 6-4తో మైఖేల్ కోల్‌మన్ (జర్మనీ)/జర్కో నీమినెన్ (ఫిన్లాండ్)పై విజయం సాధించింది.