వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » యూఎస్ ఓపెన్: మూడో రౌండ్లోకి రఫెల్ నాదల్! (Rafa Nadal | US Open | Denis Istomin | Uzbekistan | Gilles Simon | Philipp Kohlschreiber)
Bookmark and Share Feedback Print
 
FILE
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ల హవా కొనసాగిస్తోంది. నాటకీయంగా జరిగిన రెండో రౌండ్లో రఫెల్ నాదల్ ధీటుగా రాణించి సింగిల్స్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. టాప్ సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 39వ ర్యాంకర్ ఇస్టోమిన్‌తో బరిలోకి దిగాడు.

ఉజ్భెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రఫెల్ నాదల్ భారీ షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాదల్ షాట్లను ధీటుగా ఎదుర్కోలేని ఇస్టోమిన్‌కు ఓటమి తప్పలేదు. ఫలితంగా టై-బ్రేకర్ వద్ద ఆరు పాయింట్లు సాధించిన రఫెల్ నాదల్, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ను 6-2, 7-6, 7-5 పాయింట్లతో సొంతం చేసుకుని మూడో రౌండ్లోకి ప్రవేశించాడు.

ఇకపోతే.. రఫెల్ నాదల్ తన తదుపరి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ మరియు వింబుల్డన్ ఛాంపియన్ గిల్లీస్ సైమన్‌తో తలపడనున్నాడు. గిల్లీస్ తన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఫిలిప్ప్ (జర్మనీ)పై నెగ్గాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.