ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆటగాళ్ల ప్రదర్శనపై డోపింగ్ ప్రభావం ఉండబోదు: సీజీఓసీ (Commonwealth Games | Doping cases | Performance | Suresh Kalmadi | Lalit Bhanot)
ఆటగాళ్ల ప్రదర్శనపై డోపింగ్ ప్రభావం ఉండబోదు: సీజీఓసీ
FILE
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఆతిథ్య మిస్తోన్న కామన్వెల్త్ క్రీడా పోటీల బరిలోకి దిగే ఆటగాళ్ల ప్రదర్శనపై డోపింగ్ ప్రభావం ఉండబోదని కామన్వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ (సీజీఓసీ) తేల్చి చెప్పింది. డోపింగ్ పరీక్షల్లో భారత అథ్లెట్లు దొరికిపోయినప్పటికీ, కామన్వెల్త్ క్రీడా పోటీల్లో తలపడే భారత ఆటగాళ్లపై ఆ ప్రభావం ఉండబోదని సీజీఓసీ ప్రధాన కార్యదర్శి లలిత్ భనోట్ తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న నలుగురు వెస్ట్లర్లు నిషేధిత ఉత్ప్రేరకాలను ఉపయోగించినట్లు డోపింగ్ టెస్టులో తేలడంతో వారిని భారత వ్రెస్ట్లింగ్ సమాఖ్య గురువారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డోపింగ్ ప్రభావం కామన్వెల్త్ గేమ్స్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఉంటుందని అనుమానాలు వెలువెత్తాయి.
దీనిపై సీజీఓసీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ స్పందిస్తూ.. కామన్వెల్త్ పోటీలను డోపింగ్‌రహితంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు ఆటగాళ్లపై కన్నేసి ఉంచడం కుదరని పని అని, ప్రతి ఆటగాడూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే నిషిద్ధిత ఉత్ప్రేరకాలను ఉపయోగించినట్లు తేలితే ఆటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కల్మాడీ హెచ్చరించారు.