యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుడు రోహన్ బోపన్న-ఐసామ్ ఉల్ హక్ ఖురేషీ జోడీ పుషులు డబుల్స్ విభాగంలో మూడో రౌండ్‌లోకి ప్రవేశింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో జర్మనీ-ఫిన్‌లాండ్ జోడీ మైఖేల్ కోల్మాన్-జర్కాకో నేమినేన్ జంటపై స్టైట్ సెట్లలో విజయం సాధించింది.
ఈ 16వ సీడ్ ఇండో-పాక్ జంట ప్రత్యర్థి జోడీపీ 6-4, 6-4 సెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే, మిక్స్‌డ్ డబుల్ విభాగంలో గత యేడాది పైనలిస్ట్ లియాండర్ పేస్ కారా బ్లాక్‌లు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఈ జంట చెక్ రిపబ్లిక్ జంటపై 6-4, 7-5 సెట్లతో విజయం సాధించారు.