వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ క్రీడలకు దూరం కానున్న టీనెల్ అట్టార్డ్! (Hockey | Australia | Key defender | Teneal Attard | CWG | New Delhi)
Bookmark and Share Feedback Print
 
కామన్వెల్త్ క్రీడలకు ఆస్ట్రేలియా హాకీ జట్టులోని కీలక ఆటగాడు టీనెల్ అట్టార్డ్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని హాకీ ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం స్పష్టం చేశారు. అర్జెంటీనాలో జరిగిన ప్రపంచ హాకీ టోర్నమెంట్‌లో నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అట్టార్డ్‌కు మోకాలి గాయమైనట్టు, దీని నుంచి ఇంకా బాధపడుతున్నాడని వారు వెల్లడించారు. ఈ గాయం కారణంగా ప్రధాని డిఫెండ్ ఆటగాడు కామన్వెల్త్ క్రీడలకు దూరంకానున్నట్టు వారు తెలిపారు.

అటార్డ్ ఈ విధంగా గాయపడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత 12 నెలల క్రితం ఇదే తరహాలో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. దీనిపై ఆస్ట్రేలియా హాకీ జట్టు కోచ్ ఫ్రాంక్ ముర్రే మాట్లాడుతూ.. 2012లో లండన్‌లో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అట్టార్డ్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇస్తున్న ఈ క్రీడలు వచ్చే అక్టోబరు 3 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.