వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్ క్రీడలతో ప్రయోజనం శూన్యం: మణిశంకర్ (Commonwealth games | Manishankar Iyer | New Delhi | Congress)
Bookmark and Share Feedback Print
 
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం కుంభకోణంలో విలేకరులతో మాట్లాడుతూ కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. పైపెచ్చు.. కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లు, స్టేడియాల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాల వల్ల దేశానికి మరింత చెడ్డపేరు వస్తుందన్నారు.

ముఖ్యంగా, కామన్వెల్త్ క్రీడల కోసం కేటాయించిన 70 వేల కోట్ల రూపాయల నిధుల్లో కేవలం 11 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించాలని ఆయన ఆరోపించారు. ఈ మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అభివృద్ధికి ఉపయోగించివుంటే దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడి ఉండేదన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.