ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డోప్ టెస్టుల్లో చిక్కిన ముగ్గురు భారత స్విమ్మర్లు! (Indian swimmers, Dope test, New Delhi, Commonwealth Games, Swimmers)
డోప్ టెస్టుల్లో చిక్కిన ముగ్గురు భారత స్విమ్మర్లు!
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు వచ్చే నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. భారత స్విమ్మర్లకు నిర్వహించిన డోప్ పరీక్షల్లో ముగ్గురు స్మిమ్మర్లు విఫలమయ్యారు. వీరిలో ఇద్దరు స్విమ్మర్లు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించే వారు కావడం గమనార్హం.
జైపూర్‌లో జరిగిన 64వ జాతీయ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ మహిళా స్విమ్మర్‌గా నిలిచిన రిచా మిశ్రాతో పాటు.. కామన్వెల్త్ క్రీడా జట్టు సభ్యురాళ్లు జ్యోత్సా పన్సారే, అమర్ మురళీధరన్‌లు ఉన్నారు. వీరికి నిర్వహించిన డోప్ పరీక్షల్లో మిథైల్‌హెక్సాన్‌అమైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్టు నిర్ధారణ అయింది.
దీనిపై స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విరేంద్ర నానావతి డోప్ పరీక్షా ఫలితాలను నిర్ధారించారు. బి శాంపిల్ పరీక్షా ఫలితాలు పాజిటివ్‌గా వస్తే వారిని కామన్వెల్త్ క్రీడల జట్టు నుంచి రిచా, జ్యోత్సలను తప్పిస్తామన్నారు. ఈ విషయాన్ని జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి కూడా తెలియజేసినట్టు తెలిపారు. కాగా, వీరి శాంపిల్స్‌ను జైపూర్‌లో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సేకరించినట్టు నానావతి వెల్లడించారు.