15 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన టింతు లూకా!
యువ అథ్లెట్ టింతు కొత్త రికార్డును బద్దలు కొట్టింది. పదిహేనేళ్ల క్రితం మహిళల 800 మీటర్ల పరుగు విభాగంలో నమోదైన జాతీయ రికార్డును యువ అథ్లెట్ టింతు లూకా బద్దలుకొట్టింది. క్రొయేషియాలోని స్ల్పిట్‌లో జరుగుతున్న ఐదవ వీటీబీ కాంటి బ్యాంక్ కాంటినెంటల్ కప్‌లో 1.59.17 సమయంలో 800 మీటర్ల లక్ష్యాన్ని చేధించింది.
ఫలితంగా 15 ఏళ్ల తర్వాత 1995వ సంవత్సరంలో నమోదైన 1.59.85 లతో షైనీ విల్సన్ అనే అథ్లెటిక్ క్రీడాకారిణి నెలకొల్పిన జాతీయ రికార్డును 21 ఏళ్ల టింతు అధికమించినట్లైంది. అయితే ఈ పోటీల్లో టింతు ఎలాంటి పతకాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఏషియా పసిఫిక్ ఖండ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టింతు ఈ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది మంది క్రీడాకారిణిల్లో ఒకరు కావడం విశేషం.