ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » యూఎస్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన ఫెదరర్! (US Open | Roger Federer | Robin Soderling | America | Tennis)
అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో టాప్ సీడ్ రోజర్ ఫెదరర్ ఈ టోర్నీ క్వార్టర్ పైనల్లోకి అడుగుపెట్టాడు.
ప్రీ క్వార్టర్ ఫైనల్లో రోజర్ ఫెదరర్ ఫ్రాన్సుకు చెందిన పౌల్ హెన్రీ మాథ్యూని 6-4, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ఫలితంగా 48 వ సీడ్ తీమొ బక్కర్‌ను 6-2, 6-3, 6-3 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లో చోటు సంపాదించుకున్న సోదర్లింగ్‌తో రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో తనను ఓడించిన స్వీడన్ దేశస్థుడు రాబిన్ సోదర్లింగ్‌తో ఫెదరర్ తలపడనుండటం గమనార్హం. ఇంకా ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో ఫెదరర్‌ను ఓడించడం ద్వారా అతడు నెలకొల్పిన వరుసగా 23 గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్‌లో వరుస విజయాల రికార్డును సోదర్లింగ్ బ్రేక్ వేశాడు.