ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి సమంత స్టోసూర్! (Andy Murray | US Open quarterfinals | Samantha stosur | kim clijsters | Elena dementieva)
న్యూయార్క్ నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా స్టార్ క్రీడాకారిణి సమంతా స్టోసూర్ దూసుకెళ్లింది. ఐదో సీడ్ సమంతా స్టోసూర్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో రష్యా 12వ సీడ్ ఎలెనా దెమంతీవాతో తలపడింది. ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించిన స్టోసూర్ 6-3, 2-6, 7-6 (7/2) తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.
కాగా.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ సమంతా స్టోసూర్.. యూఎస్ ఓపెన్ ఛాంపియన్ కిమ్ క్లియస్టర్స్‌తో బరిలోకి దిగనుంది. కాగా బెల్జియంకు చెందిన కిమ్ క్లియస్టర్స్, మాజీ నెంబర్ వన్ సెర్బియా టెన్నిస్ స్టార్ అనా ఇవనోవిక్‌ను 6-2, 6-1. వరుస సెట్ల తేడాతో మట్టికరిపించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఆండీ ముర్రేకు చుక్కెదురైంది. టాప్ సీడ్ అయిన ఆండీ ముర్రే ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో స్విజ్టర్లాండ్‌కు చెందిన స్టాన్సిల్సన్ వార్వింకా చేతిలో ఖంగుతిన్నాడు.
ఎడమ కాలిలో ఏర్పడిన గాయం కారణంగా టెన్నిస్ కోర్టులో ధీటుగా రాణించలేకపోయాడు. ఇంకా మూడు గంటల 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-7, 7-6, 6-3 6-3 పాయింట్ల తేడాతో ఆండీ ముర్రే పరాజయం పాలైయ్యాడు. దీంతో ఈ టోర్నీ నుంచి సింగిల్స్ విభాగం నుంచి ఆండీ ముర్రే నిష్క్రమించాడు.