టాటా స్టీల్ చెస్: విశ్వనాథన్ ఆనంద్ మూడో గెలుపు!

PNR|
విశ్వవిజేత భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ టాటా స్టీల్ టోర్నీ ఐదో రౌండ్లో గెలిచాడు. హాలెండ్‌కు చెందిన జాన్ స్మీట్స్‌తో జరిగిన ఐదో రౌండ్లో విశ్వనాథన్ అద్భుతమైన ఆటతీరుతో రాణించాడు. 73వ టాటా స్టీల్ చెస్‌ "ఎ" గ్రూపులో విశ్వనాథన్ ఆనంద్‌ ప్రస్తుత విజయంతో మూడు విజయాలు నమోదు చేసుకున్నాడు. తద్వారా నాలుగున్నర పాయింట్లు సాధించాడు.

ఈ టోర్నీలో అనీష్ గిరి (హాలెండ్‌) మూడు పాయింట్లతో మాక్సిమ్ వచీర్-లగ్రావే (ఫ్రాన్స్)తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే మాగ్నస్ కార్ల్‌సన్ మరియు వ్లాదిమిర్ కామ్రిక్న్‌లు ఐదో స్థానాన్ని 2.5 పాయింట్లతో సంయుక్తంగా కొనసాగుతున్నారు.


దీనిపై మరింత చదవండి :